VKB: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందజేస్తుంది. కాగా, వికారాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల మంజూరులో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త కార్డు కావాలన్నా, పేరు చేర్చాలన్నా డబ్బులు ఇస్తేనే పనులు అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.