బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి కోలీవుడ్లో డెబ్యూ చేయనుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కాంచన 4’తో తమిళ సినీ ఇండస్ట్రీలో ఆమె అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఫతేహి మాట్లాడుతూ.. కథ బాగా నచ్చడంతో తాను ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపింది. అలాగే, ఈ మూవీ కోసం తమిళం నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది.