కడప: గత వైసీపీ హాయంలో తన నియోజకవర్గంలో భూ అక్రమాలపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కోరారు. కడప కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత రెడ్డి దృష్టికి పలు అంశాలను తీసుకుని వచ్చారు. అసైన్డ్ భూములను సైతం ఆక్రమించుకున్నారని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.