SKLM: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఫిబ్రవరిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి కోడ్ పటిష్ఠంగా అమలు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు మండలానికి ఒక ఎంపీడీఓ, తహశీల్దార్తోపాటు వీడియోగ్రాఫర్లతో కూడిన 30 ఎంసీసీ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.