SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గురువారం అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఆసుపత్రిలో ఒక శిశువు తొడలో వ్యాక్సిన్ సూది ఉండిపోయిన ఘటనపై జిల్లా డీసీహెచ్ఎస్ డా. కళ్యాణ్ బాబు ఆదేశాల మేరకు నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీపాన శీనుబాబు విచారణ చేపట్టారు. విచారణలో సదరు సూది వ్యాక్సిన్ వేసిన ఇంజక్షన్ సూదిగా అధికారులు నిర్ధారించారు.