BPT: ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదును ప్రతి లబ్ధిదారుడికి అందజేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్ల పంపిణీ చేసే సిబ్బంది ఎటువంటి అవినీతికి పాల్పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.