SRD: మహిళ అదృశ్యమైన ఘటన నిజాంపేట్ మండల పరిధిలోని నాగ్దర్ గ్రామంలో చోటుచేసుకుంది. కల్హేర్ ఎస్సై వెంక టేశం తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లక్ష్మి (53) 20వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లింది..ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధు వులు, చుట్టు ప్రక్కల ప్రాంతాలల్లో వెతికిన ఆచూకీ దొరకలేదు. కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.