HYD: పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అధికారులకు సూచించారు. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతి, పలు సమస్యలపై గురువారం ఆయన జోనల్ కమిషనర్ వెంకన్నతో కలిసి జోనల్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.