AP: రేపు కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. 15 మంది ఎంపీలతో పాటు మరో 27 మంది అధికారులు, సహాయకులు వస్తున్నందున జలవనరుల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పీపీఏ సభ్యుల పర్యవేక్షణలో వారంతా ఇవాళ రాజమండ్రికి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టులో పనులను పరిశీలించనున్నారు.