కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం పంచాయితీ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పరిశీలించారు. పంచాయితీ ఆవరణలో ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని, అలాగే ఆవరణలో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ త్సామా బాబుకు సూచించారు.