TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ కమిషన్ విచారణ జరపనుంది. ఈరోజు విచారణకు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ హాజరుకానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కమిషన్ వారిని ప్రశ్నించనుంది. కాగా.. గత ప్రభుత్వ హయాంలో సీఎం పేషీలో స్మితా సబర్వాల్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.