MDK: పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఇటీవల జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌కు చెందిన బుద్ధం దత్తు రాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుండి మూడు తులాల బంగారం పుస్తెలతాడు, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.