తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దిండిగల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.