TG: HYDలోని దోమలగూడ పరిధి అరవింద్ కాలనీలో భారీ దోపిడీ జరిగింది. బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం చోరీ అయింది. వ్యాపారి రంజిత్, అతని సోదరుడి ఇళ్లలోకి 10 మంది దుండగులు చొరబడి కత్తులతో బెదిరించి లాకర్లోని 2.5 కిలోల బంగారం తీసుకెళ్లారు. మూడు ఫోన్లు, ఐట్యాబ్, సీసీటీవీ డీవీఆర్ ఎత్తుకెళ్లారు. కాగా.. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్‌కు గాయాలయ్యాయి.