AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. ఇవాళ నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.