HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ఆవరణలో గల నాగదేవతల ఆలయంలో, ఈ రోజు ఉదయం సుబ్రమణ్య స్వామివారికి, జంట నాగులకి, నాగ దేవతలకి భక్తులు పాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం అద్దారు, పువ్వులు పెట్టారు, పత్తి మాల వేశారు. అలంకరించి, దీప ధూపాలను వెలిగించి దీపారాధన చేశారు. బెల్లం, చలిమిడి-చిమిలిని నైవేద్యాలుగా సమర్పించారు.