SKLM: నరసన్నపేట మండలం ఉర్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఓపీలను మరింత పెంచాలని తెలిపారు. అదేవిధంగా వైద్యులు, సిబ్బంది అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.