మెదక్: ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సీఆర్ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల 86 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుండి బానూరు గ్రామం వరకు కోటి రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.