ప్రకాశం: యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై మరో కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పిర్యాదు ఆధారంగా పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం యర్రగొండపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు పెద్దారవీడు పోలీసులు 41A నోటీసులు అందజేశారు.