»Shopkeeper Offers Free Beer Cans Over Purchase Of Smartphones Arrested
Free beer అని ప్రచారం.. అవి కొంటే అనడంతో ఎగబడిన జనం, పెద్ద క్యూ, ఓనర్ అరెస్ట్
Free beer cans:ఆఫర్ పెడితే జనం ఎగబడతారు. ఇక మందు ఫ్రీ అంటే.. అది వేరే లెవల్. అవును ఓ షాపు ఓనర్ (shop owners).. ఫ్రీ బీర్ క్యాన్స్ (free beer cans) అని ప్రచారం చేశాడు. ఇంకేముంది జనం (people) ఎగబడ్డారు. రద్దీ నెలకొని.. ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. సీన్లోకి పోలీసులు (police) ఎంట్రీ ఇచ్చారు. ఆ ఓనర్‌ను (owner) అరెస్ట్ (arrest) చేశారు.
shopkeeper offers free beer cans over purchase of smartphones, arrested
Free beer cans:ఆఫర్ పెడితే జనం ఎగబడతారు. ఇక మందు ఫ్రీ అంటే.. అది వేరే లెవల్. అవును ఓ షాపు ఓనర్ (shop owners).. ఫ్రీ బీర్ క్యాన్స్ (free beer cans) అని ప్రచారం చేశాడు. ఇంకేముంది జనం (people) ఎగబడ్డారు. రద్దీ నెలకొని.. ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. సీన్లోకి పోలీసులు (police) ఎంట్రీ ఇచ్చారు. ఆ ఓనర్‌ను (owner) అరెస్ట్ (arrest) చేశారు.
ఉత్తరప్రదేశ్ (uttar pradesh) బదోహీకి చెందిన మొబైల్ షాపు ఓనర్ రాజేశ్ మౌర్య (rajesh maurya) కొత్తగా ఆలోచించాడు. తన బిజినెస్ (business) పెంచుకోవాలని అనుకున్నాడు. చౌరి రోడ్లో (chauri road) గల తన షాపునకు వచ్చి మొబైల్ కొంటే బీర్స్ ఫ్రీ అని ఆఫర్ ప్రకటించారు. మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు వస్తేనే రెండు బీర్ క్యాన్స్ ఫ్రీ (free beer cans) అని చెప్పాడు. ఈ మేరకు పట్టణమంతా పోస్టర్స్ (posters), పాంప్లెట్స్తో జోరుగా ప్రచారం చేశాడు.
ఇంకేముంది ఆ షాపు (shop) వద్దకు జనం ఎగబడ్డారు. బీర్ల (beers) కోసమే మొబైల్ కొనేందుకు అంతా వచ్చేశారు. ఇంకేముంది అక్కడ రద్దీ నెలకొంది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు (police) అక్కడికి వచ్చి.. జనాన్ని (people) పంపించి వేశారు.
మౌర్యపై (maurya) 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని షాపును (shop) సీజ్ (seize) చేశారు. మౌర్య అరెస్ట్‌తో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గింది. తన షాపులో (shop) విక్రయాలు పెంచుకునేందుకు బీర్ క్యాన్స్ ఫ్రీ అని ప్రకటించిన మౌర్య.. చివరికీ కటకటలా పాలయ్యాడు. అతని షాపు ఫేమస్ అవడం.. లాభం సంగతి దేవుడేరుగు.. కానీ ఇప్పుడు సీజ్ అయ్యింది. సో.. అతని ఆలోచన మంచిదే కావచ్చు.. కానీ ఇతరులను ఇబ్బందులకు గురిచేసింది. అందుకే వర్కవుట్ కాలేదు.