AP: ఏలూరు జిల్లాలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ పర్యటించారు. కొల్లేరును పరిశీలించి, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ప్రజలు నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. కాంటూరు పరిధి తగ్గించి తమకు జీవనాధారం కల్పించాలని గ్రామస్థుల విజ్ఞప్తి చేశారు. కొల్లేరులో పూడిక తీయించాలని, పూడిక తీయకపోవడం వల్ల వరదల సమయంలో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.