AP: ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖకు టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సమాధానం ఇచ్చారు. అధికారం కోసం కాదని.. ప్రజల కోసమే సూపర్ సిక్స్ హామీలన్నారు. పార్టీలు మారినంత ఈజీగా కులం మారిపోయారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ టీడీపీ, తమ కులం బీసీ అని తెలిపారు. ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోండని సూచించారు.