SRCL : సాధారణ ప్రజలకు పురుగుల మందులు విక్రయించవద్దని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. ఇటీవల కాలంలో మండలంలోని మల్యాల, మూడపల్లి గ్రామాల్లో సాధారణ వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం పట్ల ఫర్టిలైజర్ యజమానులతో సమావేశం నివహించారు. సీఐ మాట్లాడుతూ.. పురుగుల మందులను కేవలం రైతులకే విక్రయించాలని సూచించారు.