AP; కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో నేడు గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. రత్న, సత్యగిరుల చుట్టూ 8.4 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ జరుగుతోంది. కొండ దిగువన సత్యరథానికి పూజలు చేసి పండితులు గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. తొలుత వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ జరిగే దారి పొడవునా భక్తులకు తాగునీరు, అల్పాహారాలను ఏర్పాటు చేశారు.