ప్రకాశం: ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో వరి పంట పొలాలను మండల వ్యవసాయ శాఖ అధికారి శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుత వాతావరణంలో వరి పంటలో అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉందని తెలిపారు. సుడి దోమ ఉధృతిని తగ్గించేందుకు ప్రతి రైతు వరి పంట పొలాల్లో నీటిని బయటకు పంపి ఆరబెట్టాలన్నారు. అలాగే అగ్గి తెగులు నివారణకు రైతులకు తీసుకోవలసిన చర్యల గురించి ఆయన వివరించారు.