TG: పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో నేరస్థులతో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని ఉంచారని పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే స్పెషల్ బ్యారక్‌లో పట్నం నరేందర్‌ను ఉంచాలని కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.