TG: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీ నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 2 లేదా 3వ తేదీల్లో హైదరాబాద్ శివారులో భారీ సభను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సభకు జాతీయ నాయకులను ఆహ్వానించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.