ప్రకాశం: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఇంకొల్లు మండలంలోని వివిధ అంగన్వాడీ సెంటర్స్‌లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అంగన్వాడీలో చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలతో, గర్భవతులతో బాలింతలతో ముఖాముఖిగా మాట్లాడి అంగన్వాడీ రికార్డ్స్‌ను పరిశీలించారు. అంగన్వాడీ ద్వారా అందించు పోషణ కిట్ అందించారు.