BPT: బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలో పౌర సమాఖ్య సంస్థల ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో వాడుకలో ఉన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని వారు కోరారు. త్వరలోనే పురపాలక సంఘ పరిధిలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం దిశగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.