PLD: ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగదారులను చైతన్య పరచాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు శుక్రవారం కోరారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద బాబుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు.