జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. నిన్న కిష్త్వార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వారిని నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌లుగా గుర్తించారు. దీంతో ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.