వయనాడ్ సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో ‘ఓ యోధురాలిలా పోరాడుతా’ అని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆమె.. ప్రజలను తప్పుదోవ పట్టించి.. సమానత్వం, అందరికీ న్యాయం వంటి రాజ్యాంగ విలువలను నాశనం చేయాలని BJP ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను తన సన్నిహితులకు ఇచ్చిన మోదీ.. వారికి లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని విమర్శించారు.