తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో తిరిగి చేతులు కలిపే ప్రసక్తే లేదని NCP SP కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే తెలిపారు. అజిత్ బీజేపీ వర్గాన్ని వీడితే తప్ప అందుకు ఛాన్స్ ఉండదని వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 48 స్థానాల్లో 30 చోట్ల విజయం సాధించిందన్న సూలే.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.