యమునా నదిలో కాలుష్యం కోరలు చాస్తోంది. నీటి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరటంతో నదిలో విషపూరిత నురగ భారీగా ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో నురగ వస్తోంది. ఈ కలుషిత నీటిలోనే భక్తులు కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ నీరు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.