మన శరీరంలో కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల జలుబు వస్తుంది. ఇలా తరచూ జలుబు బారిన పడకూడదంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అల్లం, మిరియాలు వంటి సుగంధద్రవ్యాలను ఆహరంలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనితో పాటు విటమిన్ A, Cలు ఉండే జామ, నిమ్మ, బొప్పాయి వంటి పదార్థాలు తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.