అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందటంతో ఇరాన్ కరెన్సీ భారీగా పతనమైంది. ఒక డాలరుకు 7.03 లక్షల రియాల్స్ స్థాయికి పడిపోయింది. ట్రంప్ గెలుపుతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక పరిస్థితులూ మరింత అధ్వానంగా మారతాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా అధ్యక్షులు మారినంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని, తాము ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు.