అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ భారతీయ షెఫ్ వికాస్ ఖన్నా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘హలో మిస్టర్ ప్రెసిడెంట్..! మనం చివరిసారి భారత్‌లో కలిసినప్పుడు వైట్‌హౌస్‌లో భారతీయ వంటకాలను రుచి చూపించే అవకాశాన్ని కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తారని ఆశిస్తున్నా’’ అంటూ వికాస్ ఖన్నా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.