అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ‘అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా నిలబడి చరిత్రాత్మకమైన ప్రచారం నిర్వహించిన హారిస్ చాలా ధైర్యం ఉన్న ప్రజా సేవకురాలు. సంకల్పంతో పోరాటాన్ని కొనసాగిస్తారు. అమెరికా ప్రజలందరికీ ఛాంపియన్గా ఉండటంతో పాటు రాబోయే తరాలకు మార్గదర్శిగా నిలుస్తారు’ అని పేర్కొన్నారు.