మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ అభ్యర్థి వినూత్న హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ధంజయ్ ముండేపై పోటీ చేస్తున్న రాజేసాహెబ్ దేశ్ముఖ్ పెళ్లికాని అబ్బాయిలందరికీ పెళ్లి చేస్తానని ప్రకటించారు. ఆయన తన ప్రచారంలో ‘నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు చేస్తాను. అబ్బాయిలందరికీ ఉద్యోగం ఇప్పిస్తాను’ అని హామీ ఇస్తున్నారు.