AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అక్టోబర్ 22న విద్యార్థిని అదృశ్యమైంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తమ కుమార్తె కనిపించకపోవటంపై తల్లిదండ్రులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజులు గడిచిపోయినా తమ కుమార్తె ఆచూకీ తెలియలేదని అన్నారు. బాలిక అదృశ్యానికి కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని లేఖలో ఆరోపించారు.