NTR: విస్సన్నపేట పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.