కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ చిత్రం అక్టోబర్ 31న రిలీజై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ సభను చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని తెలిపారు. ఆ రోజే గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురయ్యారు.