ASR: అరకులోయ మండలంలోని పెదలబుడు పంచాయతీ పరిది శరభగుడలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 100 కుటుంబాలు జీవిస్తున్న గ్రామంలో ఉన్న చేతి పంపు పనిచేయక 20 రోజులుగా కొళాయి వద్ద కొంచెం కొంచెం వస్తున్న నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు బుధవారం వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.