WGL: డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్‌కు విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో సంబంధం లేని వ్యక్తిని సత్కరించినందుకు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ తాఖీదు ఇచ్చారు. వరంగల్ జిల్లా విద్యాశాఖతో సంబంధం లేని వ్యక్తిని అక్టోబర్ 30న వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి ఛాంబర్లో సత్కరించడం ప్రవర్తనా నోటీసులో పేర్కొన్నారు.