WNP: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. సోమవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, రిసెప్షన్ లాకప్, మెన్ బ్యారక్ పరిసరాలను పరిశీలించారు. చట్టాన్ని అతిక్రమించి సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.