AP: డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. హోంమంత్రిగా తాను ఫెయిల్ అయ్యానని పవన్ ఎక్కడా అనలేదని చెప్పారు. పవన్‌తో మాట్లాడి క్లారిటీ తీసుకున్నానని.. ఆయన వ్యాఖ్యలను తాను పాజిటివ్‌గా తీసుకుంటున్నానని తెలిపారు. తాను కూడా సోషల్ మీడియా బాధితురాలినేనని.. ఆయన చేసిన వ్యాఖ్యలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పకడ్బందీగా ఉన్నామని పేర్కొన్నారు.