TG: కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాంగ్రెస్ సర్కారు పక్కదారి పట్టిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కనీసం మాజీ సర్పంచులతో మాట్లాడేందుకు కూడా సమయం లేదా! నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలయ్యాయని ప్రచారం చేస్తున్నారు.. 300 రోజులైనా 6 గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. మహారాష్ట్రలో పోస్టర్లు వేసినట్లు తెలిపారు.