»Ap Cm Ys Jagan Sendoffs To Governor Bishwabhushan Harichandan
Farewell గవర్నర్ కాళ్లు మొక్కిన సీఎం జగన్
కరోనా సమయంలో మీరు అందించిన సహకారం, మద్దతు మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. 44 నెలల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని పేర్కొన్నారు.
చత్తీస్ గఢ్ గవర్నర్ కు బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan)కు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాదాలకు నమస్కరించారు. అనంతరం దగ్గరుండి గవర్నర్ దంపతులను విమానం ఎక్కించి గన్నవరం విమానాశ్రయంలో సాగనంపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మూడున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Governor) గా వ్యవహరించిన బిశ్వభూషణ్ చత్తీస్ గఢ్ (Chhattisgarh)కు బదిలీపై వెళ్లారు.
అంతకుముందు రాజ్ భవన్ లో అధికారులు, సిబ్బంది గవర్నర్ దంపతులకు వీడ్కోలు పలికారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ సిబ్బంది సేవలను మరచిపోలేమని బిశ్వభూషణ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో మీరు అందించిన సహకారం, మద్దతు మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. 44 నెలల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సిబ్బందితో కలిసి గవర్నర్ దంపతులకు బహుమానం అందించి సత్కరించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) నియమితులయ్యారు. ఈనెల 24న ఆయన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి విజయవాడకు చేరుకోనున్నారు.
గవర్నర్ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీడ్కోలు సమావేశం నిర్వహించింది. విజయవాడ (Vijayawad)లోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ కు సీఎం జగన్ సత్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ. ‘గవర్నర్, ముఖ్యమంత్రి సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి. సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సీఎం జగన్ ను నా కుటుంబసభ్యుడిగా భావిస్తున్నా. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం అద్భుతమైనది. ఏపీ ప్రజలను ఎప్పటికీ మరువను. కరోనా కాలంలో వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. ఏపీ నా రెండో ఇల్లు’ అని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆత్మీయ వీడ్కోలు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన బిశ్వభూషణ్ హరిచందన్. pic.twitter.com/WBtWZWxHyw