అన్నమయ్య: నేడు జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతుల కోసం మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా జిల్లా కలెక్టర్ చామకూరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న కార్యక్రమాన్ని ప్రారంభించనుందని, అన్నమయ్య జిల్లాలో అదే రోజున ఆరు నియోజకవర్గాలలో ఆరు ముఖ్యమైన రహదారులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.