KRNL: టీడీపీ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తుందని టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు. శుక్రవారం ఆలూరు మండల కేంద్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.